ETV Bharat / state

'సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించండి'

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

TRS ministers involved in Mahabubnagar MLC election campaign
'సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించండి'
author img

By

Published : Mar 3, 2021, 1:42 PM IST

మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ రాములు కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం వారు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. విద్యావంతురాలైన పీవీ నరసింహారావు కుమార్తెను ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. పోలింగ్‌లో అందరూ పాల్గొనే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఒక్కో నాయకుడు 50 మంది పట్టభద్రులకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి.. ఓటు హక్కును వినియోగించుకునే చూడాలన్నారు.

ఈ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తన ఆట పాటలతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వాణీ దేవిని గెలిపించాల్సిన అవసరాన్ని పట్టభద్రులకు వివరించారు. సమావేశంలో జిల్లా జెడ్పి ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెరాసకే సొంతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.