వ్యవసాయ పొలంలో క్రిమిసంహారక మందు తాగి గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం తుపుడగడ్డ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో గిరిజన రైతు నరేందర్ క్రిమి సంహారక మందు తాగి తనువు చాలించాడు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు...
పొలం వద్ద బాధితుడ్ని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యలో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.