ETV Bharat / state

ఉద్రిక్త పరిస్థితుల్లో రవాణా టెండర్ల బిడ్ దాఖలు - mahabubnagar transport tender bid latest news

మహబూబ్​నగర్​ కలెక్టర్​ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రవాణా టెండర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలుగా ఏర్పడిన లారీ యజమానులు టెండర్లను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు.

transport tender bid by lorry owners at mahabubnagar collector office
ఉద్రిక్త పరిస్థితుల్లో మహబూబ్​నగర్​లో రవాణా టెండర్ల బిడ్ దాఖలు
author img

By

Published : Sep 25, 2020, 10:45 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టరేట్​లో పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన టెండర్లలో బిడ్​లు దాఖలు చేసేందుకు మహబూబ్​నగర్​, జడ్చర్ల లారీ యజమానులు ఇరు వర్గాలుగా కార్యాలయానికి వచ్చారు. బిడ్​లు దాఖలు చేసే క్రమంలో ఒకరికొకరు వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ మేరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

transport tender bid by lorry owners at mahabubnagar collector office
మహబూబ్​నగర్ కలెక్టరేట్​ వద్ద పోలీసులు

ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. టెండర్​ సమయం ముగిసిన తర్వాత ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం అదనపు కలెక్టర్​ సీతారామారావు సమక్షంలో అధికారులు టెండర్​ బాక్సుకు సీల్ వేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.