ETV Bharat / state

శిక్షణా కానిస్టేబుళ్లకు క్రీడా పోటీలు

author img

By

Published : Jul 25, 2020, 10:43 PM IST

Updated : Jul 25, 2020, 10:59 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు రెండు రోజులుగా కొనసాగిన వార్షిక క్రీడలు ముగిశాయి. ఈ పోటీల్లో శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు తమ ప్రతిభను చాటారు. క్రీడల ముగింపు ఉత్సవంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

Training Police Sports meet closing ceremony in Mahabub nagar
ముగిసిన శిక్షణా కానిస్టేబుళ్ల క్రీడా పోటీలు

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్​లో ఉన్న కానిస్టేబుళ్లకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జులై 24న జిల్లా ఎస్పీ రాజేశ్వరి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు.

క్రీడల ముగింపు కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ తదితర పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. రెండు రోజులపాటు జరిగిన క్రీడల్లో పోలీసుల ప్రత్యేక గౌరవ వందనం, ఇతర ప్రదర్శనలు ఎంతో ఆసక్తిగా కొనసాగాయి.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

Last Updated : Jul 25, 2020, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.