ETV Bharat / state

పట్టాలపై యంత్రం.. రైళ్ల రాకపోకలకు అంతరాయం - train machine struck at railway track at manyamkonda

మహబూబ్‌నగర్‌ - గద్వాల మార్గంలోని మన్యంకొండ రైల్వేట్రాక్‌పై కాంక్రీట్‌ శుభ్రం చేసే యంత్రం ఒరిగింది. రైల్వే అధికారులు యంత్రాన్ని తొలగించేందుకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక రైలును పంపించారు. రైల్వే పట్టలపై నిలిచిన కారణంగా ఆదేమార్గంలో వెళ్లే పలు రైళ్లు నిలిచిపోయాయి. అధికారులు వేరే మార్గాల గుండా వాటిని పంపిస్తున్నారు.

పట్టాలపై నిలిచిన రైల్వే యంత్రం.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
author img

By

Published : Oct 9, 2019, 8:26 PM IST

Updated : Oct 9, 2019, 9:52 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా మన్యంకొండ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై కంకర శుభ్రం చేసే యంత్రం అదుపుతప్పింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు పాక్షికంగా కొన్ని రైళ్లను దారి మళ్లించారు. పట్టాలపై యంత్రం పనిచేస్తుండగా.. అదుపుతప్పడం వల్ల బీసీఎం ఇంజన్‌ పట్టాల నుంచి నేలపై ఒరిగింది. క్రేన్‌ సాయంతో ఈ యంత్రాన్ని తిరిగి పట్టాలపైకి ఎక్కించాల్సి ఉంటుంది. ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో మహబూబ్‌నగర్‌ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను కొన్ని రద్దు చేయగా.. మరి కొన్ని దారి మళ్లించారు. మహబూబ్‌‌నగర్‌ జిల్లా పరిధిలో పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కాచిగూడ నుంచి వెళ్లాల్సిన నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ దివిటిపల్లిలో, చెన్నై-చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ జడ్చర్లలో, హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌ స్టేషన్‌లో నిలిచిపోయాయి. కాచిగూడ నుంచి వచ్చిన వీటిని తిరిగా కాచిగూడకు వెనక్కి రప్పించారు అధికారులు. సికింద్రాబాద్‌, రాయిచూరు మీదుగా దారి మళ్లించారు.
కాచిగూడకు వెళ్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ దేవరకద్రలో ఆగిపోయింది. రైల్వే అధికారులు అందులోని ప్రయాణికులను 25 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్​ తరలించారు. కాచిగూడ ప్యాసింజర్‌ కౌకుంట్లలో, కాచిగూడ డెమూ గద్వాల వరకు, గుంటూరు ప్యాసింజర్‌ మహబూబ్‌నగర్‌ వరకే పరిమితం చేశారు. దీంతో ప్రయానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మె కారణంగా బస్సులు సైతం లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఆటోలను, జీపులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు సమీప స్టేషన్‌లకు చేరుకుని రైళ్లను అందుకోవాల్సిందిగా రైల్వే స్టేషన్‌లలో అధికారులు ప్రకటించారు.

పలు రైళ్ల దారి మళ్లింపు..

  • కాచిగూడ-చెంగల్‌పట్టు రైలు రాయచూర్‌, గుత్తి మీదుగా మళ్లింపు
  • కాచిగూడ-నాగర్‌కోయిల్‌ రైలు రాయచూర్‌, గుత్తి మీదుగా మళ్లింపు
  • కాచిగూడ-చిత్తూరు రైలు రాయచూర్‌, గుత్తి మీదుగా మళ్లింపు
  • కాచిగూడ-మైసూరు రైలు రాయచూర్‌, గుత్తి మీదుగా మళ్లింపు
  • ఓఖా-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రాయచూర్‌, గుత్తి మీదుగా మళ్లింపు
  • కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్‌ మహబూబ్‌నగర్‌ వరకే పరిమితం
  • సికింద్రాబాద్‌-కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌ వరకే పరిమితం
  • కాచిగూడ-కర్నూలు సిటీ రైలు ఉందానగర్‌ వరకు పరిమితం
  • కర్నూలు సిటీ-సికింద్రాబాద్‌ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ దేవరకొండ వరకు పరిమితం
  • రాయచూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ గద్వాల వరకు పరిమితం
  • గుంటూరు- కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ కౌకుంట్ల వరకు పరిమితం
    పట్టాలపై యంత్రం.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Last Updated : Oct 9, 2019, 9:52 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.