రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా... రైతుని రారాజును చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు పండించిన పంట మెుత్తాన్ని గిట్టుబాటు ధర కల్పించి... కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా ధాన్యం కొనుగోలు కోసం కేసీఆర్ రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు ఆపలేదని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొంటామని తెలిపారు. గత సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు పూర్తి బాధ్యతను తహసీల్దారులు తీసుకోవాలని, మిల్లర్లు ఎక్కడ ధాన్యం ఆపకుండా ఎప్పటికప్పుడు తరలించాలని తెలిపారు. రైస్ మిల్లర్లు సహకరించకపోతే బ్లాక్ లిస్టులో ఉంచాలని పేర్కొన్నారు. రైస్ మిల్లులు సామర్థ్యం, పూర్తి వివరాలను సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కొనుగోళ్లకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ ధనాధన్.. రచ్చ రచ్చకు వేళాయే!