ETV Bharat / state

'వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - మహబూబ్​నగర్ జిల్లావార్తలు

రాష్ట్రంలో అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే పంటల పరిస్థితిపై సీఎం సమీక్షించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

TO help farmers loss with floods demand by tdp nationa secretery dhayakar reddy
'వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'
author img

By

Published : Oct 22, 2020, 7:19 AM IST

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోయినా కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రైతులను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి విమర్శించారు. వెంటనే పంటల పరిస్థితిపై సమీక్ష నిర్వహించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహబూబ్​నగర్ జిల్లాలో అధిక వర్షాల కారణంగా పత్తి, వరి, ఆముదం సహా ఇతర పంటలు పూర్తిగా నష్టపోయాయని అన్నారు. పంటలను కాపాడుకునేందుకు అధికంగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈసారి దారుణ పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి.. సర్వేలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఎల్లూరు పంపు హౌజ్ మునకపై ముఖ్యమంత్రి సమీక్షించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.