ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని బంగారు తెలంగాణ చేయాలనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైందని... అప్పుల తెలంగాణగా మిగిలిందని మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిని పరిశీలించిన జితేందర్‌రెడ్డి.. రోగులకు అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కూడా నిధులు లేవని... రాష్ట్రమంతా అనారోగ్య బారిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో జ్వరపీడితులు ఆసుపత్రుల పాలవుతున్నారని... కనీస సౌకర్యాలు, మందులు కూడా సమకూర్చలేని పరిస్థితి ఉందన్నారు. రైతుబంధు, నూతన పింఛన్లు, ఉచిత విద్యుత్ వంటి ఫలాలు ఎక్కడ అందడం లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయం తెరాస పార్టీది కాదు: రాజాసింగ్