పల్లెల్లో 150 రకాల అభివృద్ధి పనులను సర్పంచ్‌లు దిగ్విజయంగా నిర్వహించవచ్చని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీలకు ట్రాక్టర్లు ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలన్నారు.
ఇంటింటికి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత తప్పనిసరని మంత్రి గుర్తు చేశారు. శ్మశాన వాటిక, డపింగ్ యార్డులకు భూములు సమకూర్చుకుని జనాలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
- ఇదీ చూడండి : జీన్స్‌తో చర్మవ్యాధులు.. తెలుసుకోండి నిజాలు!