ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ పేరుతో దోపిడీ: కొత్తకోట దయాకర్​ రెడ్డి

నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించి ఇంకా వెబ్​సైట్​ ప్రారంభం కాలేదు కానీ.. ట్రాక్టర్​ ర్యాలీలు తీయడమేంటని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్​ రెడ్డి విమర్శించారు. మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెదేపా పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

author img

By

Published : Oct 10, 2020, 8:47 AM IST

tdp representative meeting with tg parliamentary committee presidents mahaboobnagar district
ఎల్​ఆర్​ఎస్​ పేరుతో దోపిడీ: కొత్తకోట దయాకర్​ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టానికి సంబంధించిన వెబ్‌సైట్ ప్రారంభమే కాలేదు.. అప్పుడే ట్రాక్టర్లకు రాయితీలు ఇచ్చినట్లు ర్యాలీలు తీయడమేంటని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెదేపా పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణలోని 14 పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కొత్త చట్టంలో రైతులకు మేలు జరిగే అంశాలున్నాయా లేవా అని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు తెలియకుండానే ర్యాలీలు తీయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

గతంలో భూదాన్‌ ఉద్యమంలో భాగంగా పేదలకు భూములు పంచేవారనీ ఇప్పుడు రైతు వేదికలు, ప్రకృతి వనాల పేరిట పేదల నుంచి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రైతు బంధు కింద ఎకరాకు 5వేలు ఇచ్చి. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో వేలు, లక్షలు దోచుకుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు డబ్బులు లేక ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.

మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి పట్టభద్రుల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సూచించిన అభ్యర్థికే ఓట్లేసి గెలిపించాలని దయాకర్​ రెడ్డి కోరారు.

ఇదీ చదవండి: కదులుతున్న కారులో అత్యాచారం- ఆపై బయటికి తోసేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.