ETV Bharat / state

బంగారు తెలంగాణ కేసీఆర్​ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం

బంగారు తెలంగాణ కల్వకుంట్ల కుటంబానికి వచ్చింది తప్ప... ప్రజలకు కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కోటకదిరలో... కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

talangana congress incharge manickam tagore started signature campaign in kotakadira
బంగారు తెలంగాణ కేసీఆర్​ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం
author img

By

Published : Nov 3, 2020, 2:26 PM IST

రైతులు, యువత, మహిళలు కలలు గన్న తెలంగాణ కోసం ఇక నుంచి కాంగ్రెస్ నూతన ఒరవడితో పని చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మహబూబ్​నగర్​ జిల్లా కోటకదిరలో ప్రారంభించారు. సోనియా కలలుగన్న తెలంగాణ కోసం మిషన్ 2023 లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్తున్న బంగారు తెలంగాణ కూతురు, కొడుకు, అల్లుడికి మాత్రమే వచ్చింది... తప్ప ప్రజలకు రాలేదని మాణిక్కం విమర్శించారు.

కొత్త చట్టాలతో ఎవరి భూముల్లో వారే కూలీలుగా వెళ్లే దుర్గతి వస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే రాహుల్, సోనియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసి రైతుల భూములకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. కేసీఆర్ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడి చేసి... అంబానీ, ఆదానీలతో పోటిపడుతోందని విమర్శించారు. 12 వేల సంతకాలు సేకరించి గవర్నర్, రాష్ట్రపతికి అందిస్తామని వివరించారు.

తెలంగాణలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసినట్టుగా తీర్మానం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాలకు సాగునీరిచ్చే జీవో-69ను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్ కుమార్​, నాయకులు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ కేసీఆర్​ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం

ఇదీ చూడండి: డీజీపీని కలిసిన కాంగ్రెస్​ నేతలు... దుష్ప్రచారంపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.