ప్రధానమంత్రి మోదీ 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వారంరోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే...ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఇదీచూడండి: ఇక యూపీ మంత్రులూ ఆదాయ పన్ను కట్టాల్సిందే..!