కరోనా నిబంధనలకు అనుగుణంగా క్రీడా శిక్షణను కొనసాగించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్... అధికారులను ఆదేశించారు. క్రీడల అభివృద్ది, ఆధునిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. క్రీడల అభివృద్ధికి జిల్లాలో ప్రత్యేక క్రీడా అధికారి ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న డీవైఎస్వో పోస్టులను క్రీడాశాఖ అధికారులను ఇంఛార్జ్లుగా నియమించాలన్నారు. లేని పక్షంలో ఔట్ సోర్సింగ్ ద్వారా వారిని వెంటనే నియమించాలని ప్రభుత్వ క్రీడా శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
మహబూబ్నగర్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబోయే వాలీబాల్, బాక్సింగ్, ఆర్చరీ, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ అకాడమీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.