తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ.. ఐకాస సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్ డిపో నుంచి తెలంగాణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. నిరంతరం ప్రజలందరికి ఉపయోగపడే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కార్మికులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు సాధ్యంకాదని నిలదీశారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా స్పందన కరువైందన్నారు.
ఇవీ చూడండి : పట్టుదలే ఆయుధమైతే... ఇంటింటికి కానిస్టేబులే!!