ETV Bharat / state

మాకు ప్రత్యేక పురపాలిక కావాలి... లేదంటే పోరాటమే! - Kaverammapeta Residents news

రాష్ట్రంలో ఎన్నికలు జరగని పురపాలికల్లో వార్డుల విభజన కొనసాగుతోంది. వార్డుల విభజనపై అభ్యంతరాలు స్వీకరిస్తుండటంతో ప్రత్యేక పురపాలికలు కావాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉండి జడ్చర్ల పురపాలికలో విలీనమైన కావేరమ్మపేటను ప్రత్యేక పురపాలికగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మాకు ప్రత్యేక పురపాలిక కావాలి... లేదంటే పోరాటమే!

author img

By

Published : Mar 20, 2021, 6:51 AM IST

మాకు ప్రత్యేక పురపాలిక కావాలి... లేదంటే పోరాటమే!

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలోని బాదేపల్లి, కావేరమ్మపేటలకు వేర్వేరుగా పురపాలికలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాదేపల్లి, కావేరమ్మపేట గ్రామపంచాయతీలను కలిపి గతంలోనే జడ్చర్ల పురపాలికను ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలతో కావేరమ్మపేటను పురపాలికలో కలపకుండా మేజర్ గ్రామపంచాయతీగానే కొనసాగించారు. గతేడాది డిసెంబర్‌లో కావేరమ్మపేట గ్రామపంచాయతీ పాలక వర్గం గడువు ముగియటంతో జడ్చర్ల పురపాలికలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వార్డుల విభజన ఆపేయండి...

ప్రత్యేక పురపాలిక ఏర్పాటు కోసం పలుమార్లు జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఇదే విషయంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం సైతం ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని చట్టబద్ధంగా వాటి అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు వార్డుల విభజనను కూడా ఆపేయాలని కావేరమ్మపేట వాసులు కోరుతున్నారు. ప్రజానుకూల నిర్ణయం తీసుకుని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోరాటానికి సిద్ధం...

పురపాలిక అధికారులు మాత్రం కోర్టు ఆదేశాల సమాచారం రాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం వార్డుల విభజనపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని, ఈ అభ్యంతరాలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కమిషనర్ సునీత వెల్లడించారు. రెండు పురపాలికలు ఏర్పాటు చేయాలంటే శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అఖిలపక్ష పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.