తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన ఘర్షణల్లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో పోలింగ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం తుది విడత ఎన్నికల్లో ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్