Rahul Gandhi in Vijayabheri bus Yatra at Jadcherla : దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఓబీసీ జనగణన(OBC Sensus in India)కు తొలి ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఓబీసీల శక్తి ఏంటో తెలుస్తుందన్న కారణంతోనే జనగణనకు బీజేపీ, బీఆర్ఎస్ అంగీకరించడం లేదని విమర్శలు చేశారు. జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర(Congress Bus Yatra in Telangana)లో రాహుల్ పాల్గొని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దేశాన్ని నడిపించడంలో ఓబీసీల పాత్ర ఎంతో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీసీలు, ఆదివాసీలు, దళితులు ఎంతమంది ఉన్నారంటే ఎవరూ చెప్పలేరని తెలిపారు. దేశాన్ని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు నడపరని.. పాలన మొత్తాన్ని 90 మంది ఐఏఎస్ అధికారులు మాత్రమే నడుపుతున్నారన్నారు. ఏ శాఖకు ఎన్ని నిధులివ్వాలన్నది వాళ్లే నిర్ణయిస్తారని వివరించారు.
Rahul Gandhi Wants to Do OBC Sensus in India : ఆ 90 మందిలో ఓబీసీలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. దేశాన్ని నడపడంలో బీసీ, దళితులు, ఆదివాసీల భాగస్వామ్యం లేదా అంటూ ప్రశ్నించారు. ఆ 90 మందిలో ఓబీసీ అధికారులు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని.. 5 శాతం బడ్జెట్ మాత్రమే బీసీలకు కేటాయిస్తున్నారని విమర్శించారు. అందుకే బీసీల జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అందుకే దేశంలో ఎంతమంది ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారో తేలాలని రాహుల్ గాంధీ వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఓబీసీలకు అధికారం ఇవ్వడానికి ఇష్టపడటం లేదని మండిపడ్డారు. అందుకే కులగణనను రెండు పార్టీలు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు ఎమ్మెల్యే, ఎంపీల మాట వినరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కొద్ది మంది అధికారులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు.
Congress Vijaya Bheri in Kalwakurthi : అంతకు ముందు కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభ(Congress Vijayabheri Sabha)లో రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు రాని బీజేపీ.. బీసీ నేతను ఎలా సీఎం చేస్తుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లను దోచుకుందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి.. పేద ప్రజల భూములను లాక్కున్నారని విమర్శించారు.