ETV Bharat / state

Harithaharam : రికార్డులు నెలకొల్పారు.. బ్రేక్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు!

అడవుల విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు పాలమూరు జిల్లా అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో గత రెండేళ్లుగా విత్తన బంతులను వెదజల్లుతున్నారు. గత ఏడాది హరితహారంలో భాగంగా కోటి 18 లక్షల విత్తన బంతులను తయారు చేసి అటవీ ప్రాంతాల్లో, కొండకోనల్లో వెదజల్లి రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్‌ చేసేందుకు మళ్లీ సిద్ధమవుతున్నారు.

seed ball
seed ball
author img

By

Published : Jun 15, 2021, 1:46 PM IST

రుతుపవనాలు సమయానికే రావడం.. వర్షాలు కురుస్తుండడంతో... ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారులు సమాయాత్తమవుతున్నారు. ఓ వైపు నర్సరీలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ... మరోవైపు రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మొక్కలు నాటేందుకు అనువుగాని ప్రాంతాల్లో, కొండకోనల్లో, గుట్టల్లో విత్తన బంతులు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కోటి విత్తన బంతులు వెదజల్లేందుకు లక్ష్యం పెట్టుకుని.. కోటి 18 లక్షల విత్తన బంతులు వేసి వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడు ఆ రికార్డును తిరగరాసేందుకు సిద్ధమయ్యారు.

ఖర్చు లేకుండా

రెండు కోట్ల విత్తన బంతులను తయారు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా పచ్చదనం పెంపుకోసం కృషి చేస్తున్నారు. అందుకనుగుణంగా మహిళలు ఉచితంగా విత్తన బంతులు తయారు చేసేందుకు ముందుకు రాగా... అటవీ శాఖ విత్తనాలను సేకరించి సమకూరుస్తోంది. విత్తన బంతులు తయారీకి అవసరమైన ఎరువు, మట్టిని గ్రామ పంచాయతీలు సిద్ధం చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది.

స్వచ్ఛందంగా

విత్తన బంతుల తయారీలో పాలమూరు జిల్లా మహిళా సంఘాలకు అనుభవం ఉంది. సర్వైవల్‌ శాతం అధికంగా ఉండే విధంగా విత్తన బంతుల తయారీపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక శిక్షణలిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు విత్తన బంతులపై అవగాహన కల్పిస్తున్నారు. 10,506 మహిళా సంఘాల్లో ఉన్న 1,28,560 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విత్తన బంతులను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

15 రకాల విత్తనాలు

సారవంతమైన ఎర్ర మట్టిని తీసుకుని.. పేడతో చేసే జీవామృతాన్ని, కంపోస్టు ఎరువును కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న మట్టి ముద్దలుగా తయారు చేసి.. వాటిలో విత్తనాన్ని పెట్టి గుండ్రంగా బంతులుగా రూపొందించాలని సూచిస్తున్నారు. ఈ బంతుల తయారీలో 15 రకాల విత్తనాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా దొరికే వేప, చింత, శీతాఫలం, కానుగలతో పాటు ప్రధానంగా రాగి, మర్రి, జువ్వి, నేల, నల్ల తుమ్మ, చింత, మేడి తదితర అనేక రకాల విత్తనాలను ఉపయోగిస్తున్నారు. పది రోజుల్లో తమ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

గత రికార్డులను బ్రేక్‌ చేసేందుకు

విత్తన బంతుల తయారీ పూర్తయిన అనంతరం... వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఆ విత్తన బంతులను అడవులు, కొండకోనలు, మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో వెదజల్లనున్నారు. ఇందుకోసం డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. గత ఏడాది హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయటంతో పాటు.. కోటికి పైగా విత్తన బంతులు తయారు చేసి వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్న పాలమూరు జిల్లా... ఈ ఏడాది రెండు కోట్ల విత్తన బంతులను తయారు చేసి... గతేడాది రికార్డను బ్రేక్‌ చేసేందుకు సమాయత్తమవుతోంది.

రికార్డులు నెలకొల్పారు.. బ్రేక్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు!

ఇదీ చదవండి : Viral: బైక్​పై వచ్చి తుపాకీతో హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.