ETV Bharat / state

నీటిపారుదలశాఖ పునఃవ్యవస్థీకరణపై ముసాయిదా సిద్ధం - నీటిపారుదలశాఖ పనఃవ్యవస్థీకరణపై ముసాయిదా సిద్ధం

నీటి పారుదల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. నీటిపారుదల శాఖ పునఃవ్యవస్థీకరణపై ముసాయిదా సిద్ధమైంది. దీని ప్రకారం ఒక్కో చీఫ్ ఇంజినీర్​కు ఒక్కో భౌగోళిక పరిధి నిర్ణయించి పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మహబూబ్​నగర్, వనపర్తి, నాగర్​కర్నూలు కేంద్రాలుగా సీఈల పరిధులను సిద్ధం చేశారు.

preparation of draft in mahabubnagar on irrigation development reorganization
నీటిపారుదలశాఖ పనఃవ్యవస్థీకరణపై ముసాయిదా సిద్ధం
author img

By

Published : Aug 5, 2020, 6:44 AM IST

Updated : Aug 5, 2020, 7:14 AM IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆన్​గోయింగ్ ప్రాజెక్టులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ఇల్లా ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో ముఖ్యఅధికారి ఉండేవారు. నీటిపారుదల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న సీఎం ఆదేశాలతో భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అన్ని కలవనున్నాయి. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు ముసాయిదాను సిద్ధం చేసి సీఎంకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీని ప్రకారం ప్రతి చీఫ్ ఇంజినీర్​కు భౌగోళిక పరిధులు నిర్ణయించారు. వాటిలో ఉండే పథకాలన్నీ ఆ సీఈ పరిధిలోకి రానున్నాయి.

ఉమ్మడి జిల్లాలో మహబూబ్​నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ కేంద్రాలుగా.. చీఫ్ ఇంజనీర్లకు భౌగోళిక పరిధులు నిర్ణయించారు. మొత్తం ఈ ముగ్గురి పరిధిలో ఉమ్మడి జిల్లాలోని నియోజక వర్గాలతో పాటు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలూ చేరాయి. జూరాల, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయల్ సాగర్, రాజోలి బండ, తుమ్మిళ్ల, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు సహా...15 నియోజకవర్గాల్లోని, 46 ఐడీసీ ఎత్తిపోతల పథకాలు, 7463 చెరువులు ఈ ముగ్గురు సీఈల పరిధిలోకి రానున్నాయి.27 లక్షల 34వేల ఎకరాల ఆయకట్టు ముగ్గురు సీఈల పరిధిలో ఉండనుంది. తెలంగాణలో సాగుయోగ్యమైన ప్రతి భూమికి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల శాఖ పునర్వవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ముసాయిదాకు యథాతధంగా ఆమోదం తెలుపుతారా? మార్పులు చేర్పులు సూచిస్తారా వేచి చూడాల్సిందే.

వనపర్తి సీఈ భౌగోళిక పరిధులు

అలంపూర్, గద్వాల్, మక్తల్, వనపర్తి

వనపర్తి చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇతరాలు

  • 10 పంప్​హౌజ్​లు, 18 జలాశయాలు, 31 ఎత్తిపోతలు, 1654 చెరువులు
  • ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు- 1.05 లక్షల ఎకరాలు
  • జవహర్ నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల 2.33 లక్షల ఎకరాలు
  • రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం 2.03 లక్షల ఎకరాలు
  • కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకం 0.50 లక్షల ఎకరాలు
  • రాజోలి బండ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం 0.84 లక్షల ఎకరాలు
  • ఐడీసీ ఎత్తిపోతల పథకాలు 0.53 లక్షల ఎకరాలు
  • చెరువులు 0.80 లక్షల ఎకరాలు
  • మొత్తం ఆయకట్టు 8.08 లక్షల ఎకరాలు

మహబూబ్ నగర్ సీఈ భౌగోళిక పరిధులు

మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, షాద్ నగర్

మహబూబ్ నగర్ సీఈ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇతరాలు

  • 2 పంప్ హౌజ్ లు, 2 రిజర్వాయర్లు, 9 ఎత్తిపోతలు, 2302 చెరువులు
  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
  • కర్వెన కురుమూర్తి జలాశయం హెడ్ వర్క్
  • ఉదండపూర్ జలశాయం, కాలువలు 6.80 లక్షల ఎకరాలు
  • ఐడీసీ ఎత్తిపోతల పథకాలు 0.22 లక్షల ఎకరాలు
  • చెరువులు 1.19 లక్షల ఎకరాలు
  • మొత్తం ఆయకట్టు 8.21 లక్షల ఎకరాలు

నాగర్​కర్నూల్ సీఈ భౌగోళిక పరిధులు

నాగర్​కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, దేవరకొండ, మునుగోడు

నాగర్​కర్నూల్ సీఈ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇతరాలు

  • 6 పంప్ హౌజ్ లు, 14 రిజర్వాయర్లు, 1 బ్యారేజ్, 6 ఎత్తిపోతలు,3507 చెరువులు
  • కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 4.25 లక్షల ఎకరాలు
  • పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
  • నార్లాపూర్ అంజనగిరి జలాశయం హెడ్ వర్క్
  • ఏదుల వీరాంజనేయ జలాశయం
  • వట్టెం వెంకటాద్రి జలాశయం, కాల్వలు 1.30 లక్షల ఎకరాలు
  • డిండి ఎత్తిపోతల పథకం 3.61 లక్షల ఎకరాలు
  • డిండి జలశాయం 0.15లక్షల ఎకరాలు
  • ఐడీసీ ఎత్తిపోతలు 0.13లక్షల ఎకరాలు
  • చెరువులు 1.61లక్షల ఎకరాలు
  • మొత్తం 11.05లక్షల ఎకరాలు

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

Last Updated : Aug 5, 2020, 7:14 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.