ETV Bharat / state

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు.. కృష్ణా బోర్డు వాస్తవ నివేదికపై ఎన్జీటీ అసంతృప్తి - పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా బోర్డు అందించిన నివేదికపై ఎన్జీటీ అసంతృప్తి

NGT on Palamuru- Rangareddy Project: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల పిటిషన్లపై ఎన్జీటీ విచారణను మరోసారి వాయిదా వేసింది. కృష్ణా బోర్డు అందించిన వాస్తవ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

NGT on Palamuru- Rangareddy Project:
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు
author img

By

Published : Mar 10, 2022, 7:15 AM IST

NGT on Palamuru- Rangareddy Project: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ మరోసారి వాయిదా వేసింది. కోస్గి వెంకటయ్య, డి.చంద్రమౌళీశ్వర రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై... జస్టిస్​ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్​తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కృష్ణా బోర్డు అందించిన వాస్తవ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సవివరంగా ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.

అఫిడవిట్​ దాఖలు

ప్రాజెక్టును సేఫ్ లెవెల్​ వరకు తీసుకెళ్లడానికి పనులు చేశామని ఏదైనా లోపాలు ఉంటే... క్షమాపణలు చెప్పేందుకు అనుమతించాలని తెలంగాణ సాగునీటి శాఖ చీఫ్ఇంజినీరు అఫిడవిట్​ దాఖలు చేశారు. పిటిషనర్ల ఆరోపణలు సరికావని.... వాటిని కొట్టేయాలని తెలంగాణ సోమేశ్​ కుమార్​ అఫిడవిట్​ వేశారు. మట్టి తవ్వకాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సంయుక్త కమిటీ ఇప్పటికే నివేదిక అందజేయగా.... అన్ని విషయాలు 25న పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి: ఇక ప్రకటనల పరంపర.. రోస్టర్​, రిజర్వేషన్లు, జోనల్​పై స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.