ETV Bharat / state

కరోనా కమ్ముకొస్తున్నా అదే నిర్లక్ష్యం

దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తున్నవేళ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యారోగ్యశాఖ జనానికి సేవలందిస్తోంది. ప్రజలు మాత్రం కనీస బాధ్యతలు విస్మరించి, నిర్లక్ష్యం, నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లోనూ అదే దుస్థితి. కనీస జాగ్రత్తలు పాటించడంలో జనం చూపే అశ్రద్ధ కొవిడ్ కేసుల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతోంది. 14రోజుల స్వీయ నిర్బంధాన్ని కొవిడ్ రోగులు సక్రమంగా అనుసరించట్లేదు. పరీక్షలు, టీకాలు తీసుకోవడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ నియంత్రణలో జనం తీరుపై ఈటీవీ భారత్ కథనం.

People who act recklessly during the corona
కరోనా వేళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనం
author img

By

Published : Apr 20, 2021, 12:57 PM IST

కరోనా వేళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. కోవిడ్ రోగులకు స్వీయ నిర్బంధం, ఔషధాలివ్వడంతోపాటు చికిత్స, కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు కొవిడ్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కేసుల్ని తగ్గించడానికి టీకాపంపిణీ సైతం లక్ష్యానికి మించి జోరుగా కొనసాగుతోంది. జిల్లా ఉన్నతాధికారుల నుంచి గ్రామస్థాయి ఆశాకార్యకర్త వరకూ రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నా.. ప్రస్తుతానికి మందులు, ఐసోలేషన్ కిట్లు, ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, కొవిడ్ టీకాలు అన్నింటికీ ఎలాంటి కొరత లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

వైద్యారోగ్యశాఖ విశేష సేవలందిస్తుంటే జనం మాత్రం..... కొవిడ్ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యంగా, నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు. కొవిడ్ రోగులు 14రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబ సభ్యులను కలవకూడదు. అయినా ఐదారు రోజులు ఇంట్లో ఇష్టానుసారం గడిపి, వారంలో మళ్లీ కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. పరిశ్రమలు, చిన్నచిన్న కంపెనీల ఉద్యోగులు కోవిడ్ బారిన పడినా నెగటివ్ వస్తే ఐదారు రోజుల్లోనే తిరిగి విధుల్లో చేరుతున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేములలో 59కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కేసులు నమోదైనా జనంలో మాత్రం అజాగ్రత్త పోలేదు. కొవిడ్ రోగులు స్వీయ నిర్బంధంలో ఉండాలని, సాధారణ జనం బయటకొస్తే మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జనానికి పట్టడం లేదు. మాస్కులేని వారికి పోలీసులతో ఫైన్లు వేస్తున్నా మార్పు లేదని గ్రామ పెద్దలు వాపోతున్నారు.

ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో కొవిడ్ ఉందని తేలిన రోగులు... ఐసోలేషన్ కిట్ తీసుకొని హాయిగా ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించి గ్రామాలకు చేరుకుంటున్నారు. తమ వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుందనే కనీస భయం లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పుల్ని జనం తేలిగ్గా తీసుకొని పరీక్షలు చేయించుకోవడం లేదని... అలాంటి వాళ్లే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జన సమ్మర్థ ప్రదేశాలకు వెళ్లొద్దని విస్తృత ప్రచారం చేస్తున్నా ప్రజలు కనీసం పట్టించుకోవడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నా ప్రజల్లో అలాంటి ప్రాంతాలకు వెళ్లిన వారే అధికం. పల్లెల్లో కొవిడ్ రోగులను నియంత్రణలో ఉంచాలంటే రెవెన్యూ, పంచాయతీరాజ్ సహా ఇతర శాఖల సిబ్బంది తమతో విధుల్లో పాలుపంచుకోవాలని వైద్యారోగ్య సిబ్బంది కోరుతోంది. సమూహాలపై ఆంక్షలు, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.