వర్షకాలం వచ్చింది... పరిసరాలు శుభ్రంగా ఉంచండి - వర్షకాలం వచ్చింది... పరిసరాలు శుభ్రంగా ఉంచండి
పరిసరాల పరిశుభ్రతపై అధిక ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సి.వి రాములు సూచించారు. వర్షాకాలంలో నివాస ప్రాంతాల్లో నీటి స్తబ్ధత లేకుండా చూసుకోవాలన్నారు.
వర్షకాలం వచ్చింది... పరిసరాలు శుభ్రంగా ఉంచండి
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సి.వి.రాములు ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన... కలెక్టరేట్, పురపాలక కార్యాలయాలతో పాటు జిల్లా ఆస్పత్రి, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో వ్యర్థ పదార్థాల నిర్వహణను, డంపింగ్ యార్డ్లో వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను నిర్దేశించారు.
- ఇదీ చూడండి : 27న నూతన సచివాలయం, అసెంబ్లీకి శంకుస్థాపన
sample description