మహబూబ్‌నగర్ మోడల్ బేసిక్ సెంటర్ ఎదుట పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పరీక్షా కేంద్రంలో కనీస సదుపాయాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు లేవని, దోమలు అధికంగా ఉన్నాయంటూ నిరసనకు దిగారు. అధికారులు తక్షణమే పరీక్షా కేంద్రాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.
కరోనా భయం వెంటాడుతుంటే... పరీక్షా కేంద్రాల్లో కనీస భద్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు ఈగలంతా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. రేపటి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వగా... నిరసన విరమించారు.
ఇవీ చూడండి: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపు!