రంగారెడ్డి జిల్లా షాదనగర్ సమీపంలో... బూర్గుల గేట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన అబ్దుల్లా బీన్ ఖలీం, అబ్దుల్ అజీజ్, ఆఫ్రోజ్, సమద్ పాలమూరు జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా... బూర్గుల గేట్ వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి కారు బోల్తా కొట్టింది. అబ్దుల్లా బిన్ కలీమ్ అక్కడికక్కడే మరణించగా.. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు