మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పురపాలికలోని నిమ్మగడ్డ బావి, బూరెడ్డిపల్లి, చర్లపల్లి, నక్కలబండ తండాలో ఐదు ఇళ్లు కూలిపోయాయి. నియోజకవర్గంలోని నవాబుపేట, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో ప్రవహించే వాగు ఉధృతంగా పారుతున్నది.
దుందుభి వాగు జలకళతో కనువిందు చేస్తున్నది. పొంగి పొర్లుతున్న వాగులు, జలాశయాలను చూసేందుకు జనం తరలి వెళ్తున్నారు. ఎడతెరిపి లేని జల్లులతో పత్తి పంటలో వర్షపు నీరు చేరాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో పట్టణంలోని పలు కాలనీల్లో చెత్త చెదారంతో నిండిన కాలువలు దుర్వాసనతో పొంగిపొర్లుతున్నాయి గ్రామాల్లో అంతర్గత రోడ్లు చిత్తడిగా మారి జనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు