కొత్తగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 61, వనపర్తిలో 31, జోగులాంబ గద్వాల జిల్లాలో 25 మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 10, నారాయణపేట జిల్లాలో తొమ్మిది మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1872 కు చేరింది. ఇద్దరు పాజిటివ్‌తో, మరొకరు కరోనా అనుమాన లక్షణాలతో మృతి చెందారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 61 మంది కరోనా బారిన పడగా.. జిల్లా కేంద్రంతో పాటు శివారు గ్రామాల్లో మొత్తం 39 మంది కరోనా బారిన పడ్డారు. రామయ్యబౌలిలోని ఒకే కుటుంబంలో ఐదు మందికి, న్యూగంజ్‌లో ఒకే కుటుంబంలో నలుగురు చొప్పున కరోనాకు గురయ్యారు. జడ్చర్లలోని జిల్లా పోలీసు ట్రైనింగ్ కేంద్రంలో 9 మంది శిక్షణా పోలీసు సిబ్బందికి కొవిడ్-19 సోకింది. దీంతో పాటు పట్టణంలో మరో 8 మందికి పాజిటివ్ రాగా.. నవాబుపేట మండలంలో ఇద్దరు, భూత్పూరు, మిడ్జిల్ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా సోకింది.
వనపర్తి జిల్లాలో 31 కేసులు నమోదుకాగా.. 16 మంది పట్టణానికి చెందిన వారే. అమరచింతలో నలుగురు, కొత్తకోట, పెబ్బేరు మండలాల్లో ముగ్గురు చొప్పున కరోనా బారిన పడ్డారు. చిన్నంబావి, మదనాపురం, పాన్‌గల్, పెద్దమందడి, వీపనగండ్లలో ఒక్కొక్కరికి కరోనా సోకింది. వనపర్తి జిల్లా కేంద్రంలో ఒకరు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు.
గద్వాల జిల్లాలో 25 మందికి కరోనా సోకగా.. జిల్లా కేంద్రంతో పాటు శివారు గ్రామాల్లో 23 మందికి, ఇటిక్యాల మండలంలో ఇద్దరు మహమ్మరి బారిన పడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 10 మంది కరోనా బారిన పడగా... పట్టణంలో ఐదు మంది, బిజినేపల్లిలో ఇద్దరు, తెలకపల్లి, కొల్లాపూర్, కల్వకుర్తిలో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు గురయ్యారు. నారాయణపేట జిల్లాలో 9 కరోనా కేసులు నమోదు కాగా.. పట్టణంలో మూడు, మక్తల్, మద్దూరులో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు. మాగనూరు, గుండుమాల్‌లో ఒక్కొక్కరికి ఈ వైరస్ సోకింది. నారాయణపేట పట్టణంలో ఆర్‌ఎంపీ వైద్యుడు కరోనాతో మృతి చెందారు.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్