ETV Bharat / state

'నశా ముక్త్ భారత్‌కు జ్యోతి ప్రజ్వలన' - Nasha Mukt Bharat in mahabub nagar

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నశా ముక్త్ భారత్‌పై కళాకారుల కళాజాత ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి, సమాచార శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకట రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Nasha Mukt Bharat started  at Mahabubnagar district
'నశా ముక్త్ భారత్‌కు జ్యోతి ప్రజ్వలన'
author img

By

Published : Jan 2, 2021, 10:33 PM IST

ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ వెంకట రావు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి చౌరస్తాలో ప్రదర్శించిన నశా ముక్త్ భారత్ పై కళాకారుల కళాజాత ప్రదర్శనను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా తెలంగాణ సాంస్కృతిక సారథి, సమాచార శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వివక్ష పోవాలి

మత్తు పదార్థాలు బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయడం ఏ ఒక్క శాఖ ద్వారా సాధ్యం కాదన్నారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కౌమార బాలికల పట్ల గ్రామాలు, పట్టణాలలో వివక్ష పోవాలని తెలిపిన కలెక్టర్ ప్రతి ఒక్కరు బాలికలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

'సారా, కల్లు, బీడీ, సిగరెట్ ,గుట్కా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాతలు ఏర్పాటు చేశాం. నశా ముక్త్ భారత్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఎంపిక చేశారు. అందులో మహబూబ్‌నగర్‌ ఒకటి. ఈ ప్రదర్శనని జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలలో ఏర్పాటు చేస్తాం'

-వెంకట రావు , మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్

ఇదీ చదవండి:సాంకేతికాభివృద్ధిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.