ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు. 24 గంటల జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్.. చొరవ చూపించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారన్నారు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు