ETV Bharat / state

వచ్చే వానాకాలం నాటికి పాలమూరు పథకం ద్వారా సాగునీరు విడుదల - మంత్రి నిరంజన్​ రెడ్డి తాజా వార్తలు

2021 వానాకాలం నాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉదండపూర్ జలాశయం వరకూ సాగునీరు అందించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సహా.. ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల వేగం పెంచడంతో పాటు భూసేకరణ, పునరావాసం, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని నిర్ణయించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగునీరు

author img

By

Published : Aug 1, 2020, 8:08 AM IST

Updated : Aug 1, 2020, 3:01 PM IST

కాళేశ్వరం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సహా ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి శుక్రవారం పాలమూరు రంగారెడ్డి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మొదట ప్రాజెక్టు ప్రారంభమయ్యే నార్లాపూర్ జలాశయం వద్ద క్యాంపు కార్యాలయంలో... పటాల ద్వారా పనుల పురోగతిని అధికారులు వారికి వివరించారు. అక్కడి నుంచి నార్లాపూర్ వద్ద పంపు హౌజ్, నార్లాపూర్ జలాశయ కట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కన్నుంచి రెండో జలాశయమైన ఏదులకు చేరుకుని పంప్ హౌజ్, సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించారు. ఏదుల వద్దే క్యాంపు కార్యాలయంలో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమీక్ష.. రాత్రి 8 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది.

వచ్చే ఏడాది వానాకాలం నాటికి సాగునీరు...

పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. వచ్చే ఏడాది వానాకాలం నాటికి ఉదండపూర్ జలాశయం వరకూ ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఏదుల జలాశయం పనులు 8 మాసాల కిందటే పూర్తయ్యాయని, కేవలం పంపులు మాత్రమే బిగించాల్సి ఉందని, కొవిడ్ కారణంగా ఆలస్యమైందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. నార్లాపూర్ జలాశయం పనులు 80 శాతం, వట్టెం జలాశయం పనులు 90శాతం, కరివెన జలాశయం పనులు 50శాతానికి పైగా, ఉదండాపూర్ పనులు 20 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

అధికారులు ,ఏజెన్సీలు కోవిడ్ సమయంలోనూ బాగా పనిచేసి ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లినందుకు వారిని అభినందించారు. మిగిలిపోయిన భూసేకరణ, పునరావాసం పనుల పూర్తికి అధికారులను ఆదేశించారు. 2021 జూన్ నాటికి ఒక్క టీఎంసీ సామర్ధ్యంతోనైనా పాలమూరు రంగారెడ్డికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోందని.. నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు.

ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంపైనా చర్చ...

సాగునీటి పథకాలు, చెరువులు, కుంటల నింపడం ద్వారా ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాలు సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సద్వినియోగం దిశగా.. 20 నుంచి 25 టీఎంసీల సామర్థ్యంతో ఆన్ లైన్ రిజర్వాయర్లు నిర్మించాలని యోచిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇప్పటికే ఈ అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని.. ఆమోదం లభిస్తే దశల వారీగా ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు వాటిని ఎక్కడ నిర్మించాలి.. భూసేకరణ సహా ఇతర అంశాలపైనా అందరు ప్రజాప్రతినిధులతో చర్చించనట్లు తెలిపారు.

పనుల వెనకబాటుకు కారణాలివే...

భూసేకరణ, కోర్టు కేసులు, సాంకేతిక అంశాలు, కరోనా ప్రభావం, నిధుల లభ్యత ఇతర కారణాల వల్లే పాలమూరు రంగారెడ్డి పనుల్లో కాస్త జాప్యం జరిగినట్లు మంత్రులు చెప్పారు. కోవిడ్ కారణంగా బిగించాల్సిన పంపులు సైతం రాలేదన్నారు. అయితే ఇతర ప్రాజెక్టులతో పోల్చితే పనుల పురోగతి సంతృత్తి కరంగానే ఉందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

నార్లాపూర్ కట్ట నిర్మాణంపై సాంకేతిక అంశాల పరిశీలన..

నార్లాపూర్ జలాశయానికి రెండు కొండల నడుమ నిర్మించాల్సిన ఆనకట్ట అంశంపైనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. అక్కడ రాతి కట్ట నిర్మించాలని లేదా జలాశయం సామర్థ్యాన్ని తగ్గిస్తూ మరోచోట మట్టి కట్ట నిర్మాణం చేపట్టాలన్న వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. జలాశయ సామర్థ్యాన్ని కుదించాలన్న ప్రతిపాదన సైతం పరిశీలనలో ఉంది. దీనిపై సాంకేతిక అంశాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల జలాశాయాన్ని నిర్మించాలని సమీక్షలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాంకేతిక అంశాలతో ముడి పడి ఉన్నందున నిర్ణయం వాటిపై ఆధాపడి ఉండనుంది.

ఇతర సాగునీటి పథకాలపైనా చర్చ...

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-5 ద్వారా ఏదుల రిజర్వాయర్ ను నింపాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న శంకర సముద్రం, భీమా, కోయల్ సాగర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-28 సమస్యలపై కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లేవనెత్తారు.

మంత్రి గరం..గరం..

ఇక... సమీక్షా సమావేశానికి నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా కలెక్టర్లు హాజరుకాగా.. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌ను సమావేశానికి ఆహ్వానించకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోనే కరివెన, ఉదండపూర్ జలాశయాలున్నాయి. అందుకు సంబంధించి భూసేకరణ ఇతర సమస్యలేమైనా ఉంటే చర్చించేందుకు కలెక్టర్ ను ఆహ్వానించాల్సిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా 80 నుంచి 90శాతం నీరు.. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక వర్గానికి రావాలని.. ఇప్పటికీ సాగునీరు అందలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పనులు వేగిరం చేసి ప్రతి నెలా పనుల పురోగతి ని వాట్సాఅప్ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజా ప్రతినిధులందరికి తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఏక కాలంలో కాలువ పనులు,టన్నెల్ పనులు చేపట్టాలన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక వర్గానికి త్వరగా నీరివ్వాలనే తపన అర్థం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. మరోసారి వట్టెం,కరివెన, ఉదండాపూర్ జలాశయాలను సందర్శించి మహబూబ్ నగర్ లో సమావేశం నిర్వహించాలనే చర్చ జరిగింది.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రాజక్టుల సీఈ రమేష్, శాసన సభ్యుడు డాక్టర్ లక్ష్మా రెడ్డి, జైపాల్ యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, భీరం హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు శర్మన్, షేక్ యాస్మిన్ బాష, ఏజెన్సీ లు హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

Last Updated : Aug 1, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.