తెలంగాణ ప్రభుత్వ కృషితో చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకొన్నాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. భూత్పూర్ మండలం మద్దిగట్లలోని మద్దికాన్ చెరువులో చేపలు పట్టే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. చెరువును పల్లె ప్రజల జీవన విధానానికి పునాదిగా అభివర్ణించారు.
కర్వెన జలాశయం పూర్తయితే కోట్లాది చేపలను పెంచి, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసుకోవచ్చన్నారు. సాగునీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవ వల్ల వేసవిలోనూ చెరువులో సమృద్ధిగా నీళ్లు ఉండి, చేపల పెంపకం సాగుతోందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అనంతరం చెరువు పరిసరాల్లో ప్రభుత్వ భూమి ఉందని, పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఎంపీపీ శేఖర్‌రెడ్డి మంత్రికి వినతిపత్రం అందజేశారు.