మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పట్టణంలోని అయ్యప్ప కొండ వద్ద 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పద్మశాలి కమ్యూనిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. పద్మశాలి సంఘానికి స్థలాన్ని కేటాయించగానే కార్యాలయ భవనంతో పాటు కమ్యూనిటీ హాలును నిర్మించుకోవడం సంతోషంగా ఉందని.. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం వీరన్నపేట్‌లోని ఎర్రమన్నుగుట్ట వద్ద 15 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ముదిరాజ్ కమ్యూనిటీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. భవన నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టాలని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతం అత్యంత వృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో 60 కోట్ల వ్యయంతో రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు హాస్టళ్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. తర్వాత పాలమూరు వంట కార్మికుల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదు: ఉత్తమ్