మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. భక్తులతో పాటు.. మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. శాంతియుత, స్వేఛ్చాయుత వాతావరణంలో జయంతి వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాంమందిర్ నుంచి తితిదే కల్యాణ మండపం వరకు ఘనంగా యాత్రను కొనసాగించారు. అంజన్న పాటలకు నృత్యాలు చేస్తూ భక్తులు, యువత పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విహారం, ఆధ్యాత్మికం, సాహసం... ఇవన్నీ ఒక్క యాత్రలోనే