ఆపదలో ప్రజలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. వైద్యపరంగా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించి... ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని చెప్పారు. మహబూబ్నగర్, హన్వాడ మండలాల్లోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. భూత్పూర్లో పంచవటి స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సురేందర్ బ్యాంకు లాకర్లో భారీగా నగదు, బంగారం