ETV Bharat / state

Mahabubnagar IT tower : నేడు దివిటిపల్లి ఐటీ టవర్ ప్రారంభోత్సవం - telangana latest news

Mahabubnagar IT tower inauguration : ద్వితీయ శ్రేణి నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి ఐటీకారిడార్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభిస్తారు. అక్కడే ఏర్పాటు చేయనున్న అమరరాజ గిగాకారిడార్‌కు భూమిపూజ చేయనున్నారు. పాలమూరులో నిర్మించిన శిల్పారామంతోపాటు....... అభివృద్ది చేసిన పలు కూడళ్లును ప్రారంభిస్తారు. అనంతరం బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు.

ktr tour in mahabubnagar
నేడు పాలమూరుకు తారక.. ప్రారంభించనున్న పలు అభివృద్ధి పనులు
author img

By

Published : May 6, 2023, 8:44 AM IST

Updated : May 6, 2023, 9:40 AM IST

నేడు పాలమూరుకు తారక.. ప్రారంభించనున్న పలు అభివృద్ధి పనులు

Mahabubnagar IT tower inauguration : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికం కానున్న ఐటి కారిడార్‌లో తొలి కంపెనీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటిటవర్‌ను ప్రారంభించాక 8 కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలుచేస్తారు. అనంతరం 262 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అమరరాజ గిగా కారిడార్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ భూమి పూజ చేస్తారు. ఐటి కారిడార్‌లో నిర్మించిన రోడ్లను ప్రారంభించి.. పరిశ్రమల ఏర్పాట్లు, వాటికి కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పనను కేటీఆర్‌ పరిశీలించనున్నారు.

KTR Mahabubnagar Tour : మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తారు. భోజన విరామం తర్వాత నగరంలో అభివృద్దిచేసిన ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ కూడలి, బస్టాండ్‌, రోడ్లు-భవనాల కూడళ్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పెద్దచెరువు సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన మిని శిల్పారామంను ప్రారంభించి.. నెక్లెస్‌ రోడ్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. కేసీఆర్‌ అర్బన్‌ ఎకోపార్క్‌లో ఏర్పాటుచేసిన జంగిల్‌సఫారి, వాచ్‌టవర్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. కరువు, పేదరికాన్ని పారదోలేందుకు ఎన్నో ఏళ్లుగా కన్న కలలు సాకారం అవుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

"ఈ రోజు బ్రహ్మాండమైనటునంటి ఐటీ టవర్​ను కట్టుకున్నాము. దాదాపు 8 ఐటీ కంపెనీలతో ఎంవోయూపై సంతకాలు చేసి వారికి అందజేస్తాం. ఐటీ టవర్, గిగా కంపెనీ, ఎనర్జిక్ పార్క్ ఇవన్నీ ఇక్కడకి రావడం అనేది కలనా నిజమా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఉద్యోగం కూడా లేని పరిస్థితి ఇక్కడ. రెండు మూడు సంవత్సరాల్లో దాదాపు 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటట్లు టార్గెట్ పెట్టుకుని ముందుకెళుతున్నాం. వంద శాతం దాంట్లో విజయం సాధిస్తాం. 26వేల ఎకరాల్లో జంగల్ సఫారీని కూడా ప్రారంభిస్తాం. మహబూబ్​నగర్ జిల్లా యువతను కాపాడుకుని ఉద్యోగ అవకాశాలిచ్చి మహానగరంగా తీర్చి దిద్దడమే లక్ష్యం" - మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

పకడ్బందీగా ఏర్పాట్లు: కేటీఆర్‌ మహబూబ్​నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐటీ టవర్‌, అమరరాజా పరిశ్రమ ప్రారంభోత్సవాల వద్ద ఎక్కువ సెక్యూరిటీని పెట్టారు. ప్రతిపక్ష పార్టీలు, స్థానికులు అమరరాజా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కేటీఆర్‌ సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం జడ్పీ మైదానం, స్టేడియం మైదానం, రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి రాయచూరు వెళ్లే వాహనాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బైపాస్‌ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 6, 2023, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.