ETV Bharat / state

ప్రశాంతంగా పోలింగ్​.. బ్యాలెట్​ బాక్సుల్లో తీర్పు నిక్షిప్తం - acchampet polling

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొత్తూరులో 85 శాతం, అచ్చంపేటలో 68 శాతం, జడ్చర్లలో 66 శాతం పోలింగ్ నమోదైంది. కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించిన అధికారులు ఎలాంటి ఘటనలు లేకుండా ముగియడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.

mini municipal election polling completed

author img

By

Published : Apr 30, 2021, 9:31 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జడ్చర్లలో 27 వార్డులు ఉండగా... 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 41,515 కాగా.. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 66.60 పోలింగ్ శాతం నమోదైంది. ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రతి ఓటరు మాస్కు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి... బాదేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సుదర్శన్​రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్​రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్లలోని పోలింగ్ బూతులను తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్చర్ల పురఎన్నికల బరిలో మొత్తం 112 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా వారి భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమై ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ పెట్టెలను బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలోని స్ట్రాంగ్ రూం కు తరలించారు.

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలికలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అచ్చంపేటలో మొత్తం 20వార్డులు ఉండగా.. 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో 20,684 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా... 14వేల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 68 శాతం పోలింగ్ నమోదైంది. 2016లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో అచ్చంపేటలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. తొలుత మందకోడిగా ఉన్న జనం క్రమంగా పెరిగారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 10వ వార్డులో, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు 20వ వార్డులో, నాగర్​కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీకృష్ణ 19వ వార్డులో... ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ మనుచౌదరి పరిశీలించారు. 10వ వార్డుల్లో కొందరు ఓటర్లకు ఆధార్​కార్డులో ఇతర మండలానికి చెందిన చిరునామాతో ఉండటంతో వారిని ఓటు వేయనీయకుండా కాంగ్రెస్, భాజపా ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లంతా మాస్కులు ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిబ్బంది సైతం మాస్కులు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ ధరించి విధులు నిర్వహించారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లు, శానిటైజర్లు, మాస్కులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరులోనూ పురపాలికల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొత్తూరులో 12వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 4 చోట్ల పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మొత్తం 8,222 ఓటర్లకు గానూ... 7,023 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.42 శాతం ఓటింగ్ నమోదైంది. కొత్తూరులో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 12 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగింది. ఒంటి గంట నుంచి 3 గంటల వరకూ జనం పలుచగా కనిపించారు. 3 గంటల తర్వాత మళ్లీ జనం పుంజుకున్నారు. 5 గంటల తర్వాత కొన్నిచోట్ల కొవిడ్ రోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా.. పీపీఈ కిట్లు ధరింపజేసి వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కొత్తూరులో 47మంది అభ్యర్ధులు బరిలో నిలవగా వారి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. గత శాసనసభ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తూరు పరిధిలో 90 శాతం కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యేది. ఈసారి 85 శాతానికే పరిమితమైంది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ముగియగా... ఎన్నికల సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాలెట్ పెట్టెలను ఆయా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూంలకు చేర్చారు.

ఇదీ చూడండి: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెంకట్రావ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.