రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఆయన పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు.. దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పేద వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మజీద్‌లకు, అక్కడ ఉండే ఇమామ్, మౌజమ్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ పుట్టిన రోజు సందర్భంగా.. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తెరాస నాయకులు ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
![mahmood ali said Two mlc positions swipe open in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10847568_12.png)
ఇదీ చూడండి : ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం: కేటీఆర్