ETV Bharat / state

పాలమూరు రైతుల ఆశలపై నీళ్లు

వర్షాల్లేవ్. పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు... ఖాళీ కుండళ్లా జలాశయాలు. అడుగంటిపోయిన చెరువులు, కుంటలు, బావులు. వరుణిడి కోసం రైతున్నలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. వరినాట్లు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది.

పాలమూరు రైతుల ఆశలపై నీళ్లు
author img

By

Published : Jul 10, 2019, 4:58 AM IST

Updated : Jul 10, 2019, 11:23 AM IST

పాలమూరు రైతుల ఆశలపై నీళ్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షంపై రైతుల ఆశలు గల్లంతవుతున్నాయి. ఓ వైపు వర్షాలు లేవు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఉమ్మడి జిల్లాకు జలప్రదాయనిలైన జలశయాలు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండితే తప్ప ఈ ప్రాజెక్టులపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలకు నీళ్లు రావు. మహరాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండితేనే వాటికి నీళ్లొచ్చేది.

ఖాళీ కుండల్లా జలాశయాలు

ప్రస్తుతం ఆల్మట్టి జలాశయానికి 69వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 6వేల700 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. కానీ జూరాలకు మాత్రం ఎలాంటి వరద లేదు. జూరాల నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 1.60 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... 31టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు జలాశయాలు నిండితేనే జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీళ్లందుతాయి.

లోటు వర్షపాతం

జిల్లాలోని ఏ ఎత్తిపోతల పథకం కింద కూడా రైతులు పంటలు వేయడం లేదు. బోరుబావులు, చెరువులు, కుంటల్లో కొద్దో,గొప్పో నీరు నిల్వ ఉన్నచోట సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. పత్తి, వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రైతులు వరిసాగు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం... జోగులాంబ గద్వాల జిల్లాలో 45శాతం, మహబూబ్​నగర్​లో 21శాతం, నాగర్ కర్నూల్​లో 19శాతం, వనపర్తిలో 37శాతం లోటు వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో సుమారు 13 మండలాల్లో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం

వర్షాల్లేక ఉమ్మడి జిల్లాల్లో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. మహబూబ్​నగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 20వేల హెక్టార్లు కాగా... ఇప్పటి వరకూ 25వేల హెక్టార్లు కూడా సాగులోకి రాలేదు. నాగర్​కర్నూల్ జిల్లా మొత్తం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపైనే ఆధారపడి ఉంది. గత ఖరీఫ్ లో వరి, వేరుశనగను విస్తృతంగా సాగు చేసిన రైతులు ఈసారి సాహసం చేయలేకపోతున్నారు. కందనూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2లక్షల 20వేల హెక్టార్లు కాగా... 60వేల హెక్టార్లు కూడా ఇప్పటి వరకూ సాగు కాలేదని అంచనా. వనపర్తి జిల్లాలో 80వేల హెక్టార్ల సాగు భూమి ఉండగా... 7వేల హెక్టార్లల్లో మాత్రమే పంటల్ని సాగు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న లక్షా 33 వేల హెక్టార్లల్లో... 23వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. నారాయణపేట జిల్లాలోనూ లక్షా 13వేల హెక్టార్లకు 30వేల హెక్టార్లల్లో పంటలు వేశారు.

వర్షాల్లేక వరి, మొక్క జొన్న లాంటి పంటల జోలికి వెళ్లుకుండా వర్షాధార పంటలు, తృణధాన్యాల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వర్షాలు కురిసి నేలలో పదును వస్తే తప్ప పంటలు వేయొద్దని చెబుతున్నారు.

ఇదీ చూడండి: నేడే మున్సిపల్​ ఓటర్ల జాబితా

sample description
Last Updated : Jul 10, 2019, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.