కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అమలుపై జిల్లా అధికారులతో మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు సమీక్ష నిర్వహించారు. రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారిని ఎక్కడికక్కడే క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని మండలాలు, గ్రామాల్లోని పాఠశాలలు, ఇతర భవనాలను గుర్తించి క్వారైంటన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినట్లయితే తక్షణమే జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కలెక్టర్ సూచించారు. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లైతే వెయ్యి రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు.