మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, ప్రత్యేక అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్షను నిర్వహించారు.
మహబూబ్నగర్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణంలో జాప్యం జరగకుండా ఉండేందుకు నిధులు కేటాయించడం, ఇసుక సరఫరాలో సమస్యలు చర్యలు చేపట్టాలని జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు వేదికల నిర్మాణంపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని.. నిర్మాణాలలో నాణ్యత లోపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ముందుగా రైతు వేదికను నిర్మించిన వారికి నగదు బహుమతిని ఇస్తామని కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు.
ఇవీ చూడండి: ఈనెల 12నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు