ETV Bharat / state

స్వీయ నియంత్రణే మొదటి ఆయుధం: కలెక్టర్​

author img

By

Published : Apr 22, 2021, 11:27 PM IST

Updated : Apr 23, 2021, 1:01 AM IST

మహబూబ్​నగర్ జిల్లాలో రోజురోజుకీ కొవిడ్ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. మరోవైపు దేశంలో, రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? కేసులు పెరిగితే అవసరమైన పడకలు, ఆక్సిజన్, మందులు, చికిత్స జిల్లాలో అందుబాటులో ఉన్నాయా? కేసుల ఉద్ధృతిని తగ్గించడానికి, కరోనా బారిన పడిన వారిని రక్షించడానికి యంత్రాంగం ఏం చేస్తోందన్న విషయాలపై మహబూబ్​నగర్ కలెక్టర్ వెంకట్రావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

mahabubnagar collector venkat rao, S Venkata Rao latest news
స్వీయ నియంత్రణే మొదటి ఆయుధం: కలెక్టర్​
స్వీయ నియంత్రణే మొదటి ఆయుధం: కలెక్టర్​

ప్ర- ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కోవిడ్ తీవ్రత ఎలా ఉంది ?

స: గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కేసుల తీవ్రత అధికంగా ఉంది. అలాగని ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత అధికంగా లేదు. అయితే ప్రజలు కనీస నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేసున్న కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఒక కుటుంబంలో ఒకరికొస్తే మిగిలిన వాళ్లంతా దూరంగా ఉండి జాగ్రత్తలు పాటించే వాళ్లు. కేసులు తక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి వస్తే సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పరీక్షలు నిర్వహిస్తే కుటుంబంలో ఎక్కువ మందికి పాజిటివ్ లు వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. జిల్లాలో ప్రస్తుతం 4584 క్రీయాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకూ 127 మరణాలు సంభవించాయి.

ప్ర- కొవిడ్ నియంత్రణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు.

స: వ్యాధి రాకుండా అడ్డుకోవాలంటే స్వీయ నియంత్రణే మొదటి ఆయుధం. పౌరులు దీన్ని గ్రహించాలి. యంత్రాంగం తరపున మున్సిపాలిటీలు, పట్టణాల్లో వేర్వేరుగా 18 టాస్క్ ఫోర్స్ బృందాలను మోహరించాం. మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు, రెవిన్యూ శాఖలకు చెందిన సభ్యులు ఇందులో ఉంటారు. పల్లెపట్టణాల్లో కోవిడ్ నిబంధనల అమలు సహా కర్ఫ్యూను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. నిబంధనలు పాటించని వారిని మొదట హెచ్చరిస్తారు. ఫలితం కనిపించకపోక పోతే అపరాధ రుసుములు విధిస్తారు. మార్పు లేకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తారు. మాస్కు ధరించని వారిపై ఇప్పటి వరకూ 3423 కేసులు నమోదు చేశారు.

ప్ర- ప్రాథమిక సంబంధీకులను గుర్తించే పని ప్రభావవంతంగా జరుగుతోందా?

స: గతంలో పోలీసులు ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడంలో సహాకరించేవాళ్లు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ సహా కలెక్టరేట్ కంట్రోల్ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారి నుంచి సమాచారం తీసుకుని వారి ప్రాథమిక సంబంధీకులను కూడా హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నాం. గ్రామస్థాయిలో ఈ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోంది.

ప్ర- లక్షణాలున్నా ఎక్కువమంది పరీక్షలు చేయించుకోవడం లేదు. పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నారా?

జలుబు, జ్వరం లాంటివి తేలిగ్గా తీసుకుంటున్నారు. లక్షణాలున్న వాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అందుకు గ్రామస్థాయిలో ఆశా, ఎఎన్ఎం బృందాలు అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షల విషయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో లక్ష్యాలు నిర్ణయించాం. లక్ష్యానికి మించి పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో 22417 ఆర్టీపీసీఆర్, 2,33,239 రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాం. పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయి. అందుకే కేసులు ఎక్కువగా గుర్తించగలుగుతున్నాం.

ప్ర- పరీక్షలకు ఆసుపత్రులకు రాలేని వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా?

స: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు జిల్లాలో 3 ప్రత్యేక సంచార వైద్య సేవల వాహనాలను ప్రారంభించాం. కోవిడ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స మూడింటికీ సంబంధించిన సేవలు ఒకే అంబులెన్స్ లో ఉంటాయి. ఆసుపత్రులకు రాలేని వాళ్లు కంట్రోల్ రూం నంబర్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ లు ఇంటికే వస్తాయి. పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ అయితే అక్కడే మందులిచ్చి హోం ఐసోలేషన్ చేస్తారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి అదే అంబులెన్స్ లో తరలిస్తారు. ఈ సేవల్ని ప్రజలు వినియోగించుకోవచ్చు. కంట్రోల్ రూం నెంబర్ 08542-241165

ప్ర- కోవిడ్ రోగులు 14రోజుల స్వీయ నిర్బంధాన్ని పాటించడం లేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

స: ఉపాధి కోసం, ఉద్యోగం కోసం 14రోజులు పాటించకుండా లక్షణాలు తగ్గగానే స్వీయ నిర్బంధం నుంచి బైటకు వస్తున్నారు. అందుకే 100కు పైగా కార్మికులున్న పరిశ్రమలకు దీనిపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాం. 14 రోజుల వరకూ కోవిడ్ బారిన పడిన వారిని విధుల్లోకి పిలవద్దని చెప్పాం. గ్రామస్థాయిలో కూడా కొందరు పాటించడం లేదు. పడక్బందీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.

ప్ర-పడకలు, ఆక్సిజన్, రెమిడెస్ వీర్ ఇంజక్షన్, మందుల విషయంలో కొరత ఏదైనా ఉందా?

స: జిల్లాఆసుపత్రిలో పడకల సంఖ్యను 150 నుంచి 250కి పెంచాం. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి రోగులు వచ్చే అవకాశం ఉన్నందున మరో 50 పడకలు అదనంగా సిద్ధం చేస్తున్నాం. పోలెపల్లి సెజ్ నుంచి ఆక్సిజన్ సరఫరా సరిపడా ఉంది. జిల్లా ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉంది. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజు కొరత రాలేదు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా ఆక్సిజన్ ను అందుబాటులో ఉంది. రెమిడెస్ వీర్, మందుల కొరత లేదు.

ప్ర- ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ పడకలు, చికిత్స తీరు ఎలా ఉంది?

స: ఎక్కువమంది ప్రభుత్వాసుపత్రులకు వచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. అయినా ప్రైవేటు ఆసుపత్రుల్లో 20శాతం పడకల్ని కోవిడ్ రోగుల కోసం కేటాయించాలని చెప్పాం. ఒకట్రెండు ఆసుపత్రులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులొచ్చాయి. వారిని ఐఎంఏ ద్వారా సున్నితంగా హెచ్చరించాం. ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్, రెమిడిస్ వీర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులూ సహకరిస్తున్నారు.

ప్ర- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు, ఇక్కన్నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి విషయంలో పర్యవేక్షణ ఎలా ఉంది?

స: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ల సంఖ్య ఈసారి తక్కువగా ఉంది. గతఏడాది లాక్ డౌన్ లో తిరిగి వచ్చిన వాళ్లు ఇక్కడే ఉండిపోయారు. జిల్లాలో ఆ కారణంగా ఏడెమిది వేల జాబ్ కార్డులు పెరిగాయి. కొందరు వివిధ వృత్తుల్లో స్థిర పడ్డారు. అయినా గ్రామస్థాయిలో ఎవరెవరూ వస్తున్నారన్న సమాచారాన్ని నమోదుచేసి పర్యవేక్షణ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా యంత్రాంగం తోనూ పరస్పర సమాచారాన్ని పంచుకుంటున్నాం.

ప్ర- నిబంధనల పాటింపు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

స: రాత్రి వేళ కర్ఫ్యూనికి పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఇబ్బందులేమీ లేవు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంపైనే కేంద్రీకరిస్తున్నాం. టాస్క్ ఫోర్స్ బృందాలు దీనిపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నాయి.

ప్ర- టీకా విషయంలో ప్రజలకు ఏం చెబుతారు?

స: తొలినాళ్లలో ఎవరూ టీకా వేసుకునేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వ యంత్రాంగ, సాధారణ ప్రజలు అంతా కలుపుకుని జిల్లాలో 65064 మందికి టీకా వేశాం. కావాల్సిన డోసులు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వాళ్లు ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. టీకా పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వాళ్లపైనా కఠినంగా వ్యవహరిస్తాం.

ప్ర- సెకండ్ వేవ్ లో కేసులు ఉధృతంగా పెరగుతున్న నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం చెబుతారు?

స: విపరీతంగా భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం ఏ మాత్రం తగదు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పక ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. చేతుల్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ప్రజలు ఎవరికి వాళ్లు స్వీయ నియంత్రణ పాటించాలి. జిల్లాలో మరణాల రేటు తక్కువగానే ఉంది. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. వ్యాధివ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరుతున్నాను.

ఇదీ చూడండి : 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు

Last Updated : Apr 23, 2021, 1:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.