తెలంగాణకు హరితహారం, శానిటేషన్ తదితర అంశాలపై మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకటరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని సూచించారు.
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఆదేశించారు. మండల స్థాయిలో స్వయం సహాయక మహిళా బృందాలకు ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ అధికారులకు వివరించారు.