విధులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ.. కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజలు మర్యాదగా మెలిగేవారని..రానున్న రోజుల్లో తిరిగి ఆ విధంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?