మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల పరిధిలోని భూ సమస్యలపై చర్చించారు. భూ సమస్యలు పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించేందుకు వీలున్న కేసులకు సంబంధించిన వివరాలను రికార్డులలో పూర్తి స్థాయిలో పరిశీలించాలని కోరారు. వీలైనంత త్వరగా కేసులకు పరిష్కరించాలని ఆదేశించారు.