ప్రభుత్వ ఆదేశాల మేరకు... ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 150 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట రావు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈనెల 28 నాటికి పదోన్నతులు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎలాంటి తప్పులు జరగకుండా..
ఇప్పటివరకు 74 మందికి సంబంధించిన ఉత్తర్వులు సిద్ధం చేయడం జరిగిందని ఇంకా 51 మంది ఉత్తర్వులు తయారు చేయాల్సి ఉందని తెలిపారు. వీటికి తోడు 30 కారుణ్య నియామకాలు ఉన్నాయని చెప్పిన కలెక్టర్ మొత్తం 150 మందికి పదోన్నతులు కల్పించనున్నామని వివరించారు. పదోన్నతుల విషయంలో అన్ని శాఖల అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఆదేశాలు జారీ..
ఫైల్ అప్లోడ్‌లో భాగంగా.. ఇప్పటి వరకు 47వేల ఫైళ్లను గూగుల్ స్ప్రెడ్ షీట్‌లో పెట్టామని చెప్పారు. వచ్చే నెల వరకు 50 శాతం పూర్తి చేస్తామన్నారు. అనంతరం ప్రజావాణి పిటిషన్లు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పిటిషన్లపై సమీక్ష నిర్వహించి.. జాప్యం లేకుండా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:అయోధ్య మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన