మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండర్పల్లిలోని వాగు సమీపంలో ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మికత నెలకొంది. దాతల సహకారంతో నిర్మించిన దత్తాత్రేయ గుడిలో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన కిష్టప్ప.. దత్తాత్రేయ స్వామిని కొలుస్తున్నాడు. కొన్నేళ్లుగా కేవలం పాలు మాత్రమే తాగుతూ.. ఆధ్యాత్మిక చింతన కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమందిని శిష్యులుగా చేసుకుని ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. రాతితో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని భక్తుల సహకారంతో నిర్మించారు.
గద్వాల పట్టణానికి చెందిన పాండురంగయ్య, విజయలక్ష్మి దంపతులు.. ఐదడుగుల దత్తాత్రేయ స్వామి పాలరాతి విగ్రహాన్ని ప్రత్యేకంగా కాశీనుంచి తెచ్చి ప్రతిష్ఠాపన చేశారు. స్వామి నామస్మరణతో గ్రామంలో ఆధ్యాతిక శోభ సంతరించుకుంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్