మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో చిరుత పులులు సంచరిస్తున్నట్లు పట్టణ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు, స్థానిక సర్పంచ్ కొండ విజయలక్ష్మికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అటవీశాఖ బృందం దేవరకద్రలో అర్ధరాత్రి 12 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లను గుర్తించేందుకు ఓ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కళాశాల ఆవరణలో చిరుత పులి చారల వలె ఉన్న ఒక జంతువు కనిపించగా... అది కుక్క అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మన్యంకొండ, దేవరకద్ర పరిసర ప్రాంతాల మధ్య చిరుతలు గుట్టలో సంచరిస్తుంటాయి, పశువుల కాపరులు, రైతులు చిరుతపులి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: యాసంగిలో పెరిగిన సాగు... గణాంకాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ