ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలు దోహదపడ్డాయని.. ఆయన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. పట్టణంలో ప్రొఫెసర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ సిద్ధాంతాల కోసం ప్రతీ ఒక్కరు పాటు పడాలని లక్ష్మారెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు
ఇవీ చూడండి: కశ్మీర్ డైరీ: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా.