కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం వల్ల చేసేందుకు పనులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. ఎలా బతకాలో తెలియక సొంతూళ్లకు వస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లిన వారు హైదరాబాద్ నుంచి తిరుగుముఖం పడుతున్నారు. వాహనాల రాకపోకలను నిలిపివేస్తుండడం వల్ల పల్లెలకు చేరేందుకు నడకబాటపట్టారు. తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఏకంగా వంద కిలోమీటర్లు పైన నడవాల్సి వచ్చిందన్నారు.
వలస కూలీల దీనావస్థ.. సొంతూరికెళ్లేందుకు 100కి.మీ.ల నడక - corona latest news
ఉన్న ఊరిలో ఉపాధిలేక హైదరాబాద్‌కు వలస వెళ్లిన కూలీలు సొంతూళ్లకు తిరిగొస్తున్నారు. కరోనాను నివారించేందుకు లాక్డౌన్ విధించడం వల్ల పనులు లేక, ఎలా బతకాలో తెలియక ఇంటి బాట పడుతున్నారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు తరలివస్తున్నారు.
సొంతూరు బాట పట్టిన కూలీలు