కృష్ణా నదిలో ఈ ఏడాది ముందుగానే ప్రవాహం మొదలైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టికి శనివారం సాయంత్రానికి 50 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,705 అడుగులు. ప్రస్తుతం 1,681.72 అడుగుల మట్టం వద్ద నీళ్లు ఉన్నాయి. జలాశయంలో 83.82 టీఎంసీల ఖాళీ ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే దిగువనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు నీరు వదులుతారు. ఈ ప్రాజెక్టులో 14 టీఎంసీల ఖాళీ ఉంది.
ముందుగానే
గతేడాదితో పోల్చితే ప్రస్తుతం నెల రోజులు ముందుగానే కృష్ణాలో ప్రవాహం కనిపిస్తోంది. 2019లో ఆలమట్టిలోకి జులై 14న వరద ప్రారంభమైంది. తర్వాత 12 రోజుల్లోనే ఆ ప్రాజెక్టు నిండటంతో భారీ స్థాయిలో వరదను నారాయణపూర్‌కు వదిలారు. అదే నెల 29వ తేదీన నారాయణపూర్ గేట్లు ఎత్తారు.
గోదావరిలో 11 వేల క్యూసెక్కులు
గోదావరి నదిలో 11 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రాణహిత నుంచి ఎక్కువ ప్రవాహం ఉండగా మేడిగడ్డలో 1.14 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103