మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అమిస్తాపూర్ సమీపంలోని వాసవి కల్యాణ మండపంలో ఈనెల 8, 9 తేదీల్లో 1000 జంటలతో కోటి లింగార్చన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ, సరస్వతీ పీఠాధీశులు మాధవానంద సరస్వతీ స్వామిజీ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
కోటి లింగార్చనతోపాటు కోటి పుష్పార్చన, వల్లీ-సుబ్రహ్మణ్యేశ్వర, శివపార్వతుల, శ్రీదేవి-భూదేవి సహిత శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
ఇదీ చూడండి : నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి